మై డియర్.. ఇదీ ముంబై అంటే : Amitabh Bachchan

ఎనిమిది పదుల వయస్సుకి దగ్గరలో ఉన్నప్పటికీ వరుస సినిమాలతో చేస్తూ దూసుకుపోతున్నాడు అమితాబ్‌బచ్చన్. అయితే ఇటీవలే ఆయన స్టాఫ్ అందరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనకూడా ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నాడు.


వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటే బిగ్‌బీకి చాలా ఖాళీ సమయం దొరికింది. ఈ టైమ్‌ని ఎంతో ప్రశాంతంగా గడుపుతున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటే ఈ సినీయర్ నటుడు క్వారంటైన్ సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేశాడు. అందులో అమితాబ్ కాళ్లు కనిపిస్తున్నాయి. దానికి.. ‘స్వచ్ఛమైన నీలి ఆకాశం.. వెలుగులు విరజిమ్ముతున్న సూర్యకాంతి.. మై డియర్.. ఇది ముంబై అంటే’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.


దీనిపై ఎంతో మంది ఈ మెగాస్టార్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. కొందరు ఆ పిక్‌లోని నార్మల్ టేబుల్‌ని చూసి.. ‘మిడిల్ క్లాస్‌లాగా దాన్ని ఉపయోగిస్తున్నారు.. సూపర్ సర్’ అంటూ కామెంట్ పెడుతున్నారు.


అంతేకాకుండా ఈ క్వారంటైన్ గురించి గత రాత్రి తన బ్లాగ్ రాశాడు అమితాబ్. అందులో.. ‘అత్యంత స్పష్టమైన ఆకాశం.. సున్నితమైన గాలిలో సూర్యుడు.. దాని నిశ్శబ్దంలో ధ్వని కాలుష్యం.. పక్షుల కిలకిలాలు, వాటి అరుపులలో విచిత్రం.. వాలుగా ఉన్న కుర్చీ గొప్పతనం.. ఏళ్ల తరబడి ఇలాంటి ప్రకాశవంతమైన సహజత్వాన్ని చూడలేదు.. దీనికి ముందస్తుగా చేసిన వర్క్ షెడ్యూల్ కారణం కాదు.. సమయం, సమయపాలన మాత్రమే. అలా ప్రకృతి మన కోసం నిర్వచించింద’ని రాసుకొచ్చాడు బిగ్‌బీ.


Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.