మన దేశానికి తీరని లోటు: చిరంజీవి

ABN , First Publish Date - 2021-12-09T01:05:46+05:30 IST

తమిళనాడు సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ఘటనలో రావత్‌తో పాటు ఆయన భార్య సహా 13 మంది చనిపోయారంటూ ఐఏఎఫ్ అధికారికంగా

మన దేశానికి తీరని లోటు: చిరంజీవి

తమిళనాడు సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ఘటనలో రావత్‌తో పాటు ఆయన భార్య సహా 13 మంది చనిపోయారంటూ ఐఏఎఫ్ అధికారికంగా తెలియజేసింది. దీంతో పలువురు ప్రముఖులు.. ఇది భారతదేశానికి తీరని లోటు అని ప్రకటిస్తూ.. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ వార్త విని నా హృదయం బద్దలైందని అన్నారు చిరంజీవి. ట్విట్టర్ వేదికగా ఆయన చనిపోయిన వారికి నివాళులు అర్పించారు.


‘‘సైనిక హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై.. గొప్ప ప్రతిభాపాటవాలు గల మన సైనికాధికారి, మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్యతో పాటు మరో 11 మంది చనిపోయారనే షాకింగ్ విషయం తెలిసి నా హృదయం బద్దలైంది. ఇది మన దేశానికి తీరని లోటు. వారికి అశ్రునివాళులు’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం.



Updated Date - 2021-12-09T01:05:46+05:30 IST