Bimbisara : ఫస్ట్ రివ్యూ ఇదే !

Twitter IconWatsapp IconFacebook Icon
Bimbisara : ఫస్ట్ రివ్యూ ఇదే !

యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) తాజా చిత్రం ‘బింబిసార’ (Bimbisara). చారిత్రక పాత్రను కల్పిత కథనంతో వెండితెరపై అద్బుతంగా ఆవిష్కరిస్తున్నాడు కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vasist). టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyutha Menon), కేథరిన్ ట్రెస్సా (Catherine Tressa), వరినా హుస్సేన్ (Warina Hussain) కథానాయికలుగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్, ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. టీజర్, ట్రైలర్, సింగిల్స్‌కు మంచి స్పందన రావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపు (శుక్రవారం) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. కళ్యాణ్ రామ్ చిత్రాలకు ఎప్పుడూ లేనంతగా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రేక్షకుల ఆసక్తిని మరింతగా పెంచే స్థాయిలో ప్రముఖ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యులు ఉమైర్ సంధు (Umair Sandhu) ‘బింబిసార’ మూవీ ఫస్ట్ రివ్యూను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వదిలారు. 

సినిమా చాలా బాగుందని, హీరో కళ్యాణ్ రామ్‌కి, టాలీవుడ్‌కు ఇది అదిరిపోయే కమ్‌బ్యాక్ అని ఉమైర్ అభిప్రాయపడ్డారు.  ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో దర్శకుడు వశిస్ట్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన కొన్ని విశేషాల్ని తెలిపాడు. ‘బింబిసార’ చిత్రం క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటి కథ. చాలా భాగం గ్రాఫిక్స్‌తో నడిచే సన్నివేశాలే కనిపిస్తాయి, అయినప్పటికీ సినిమాను మేం బాగా ఎంజాయ్ చేశాం. ఫిక్షనల్ స్టోరీ కాబట్టి.. రిఫరెన్స్‌లు ఏమీ కనిపించవు. బింబిసార పాత్రను, అతడి రాజ్యాన్ని సృష్టించారు. ‘బింబిసార’ పాత్రకి ఫస్టాఫ్ లోనే ముగింపు ఉంటుంది. రెండో భాగంలో అదే ‘బింబిసార’ పాత్రతో తాజా కథ ప్రారంభమవుతుంది. అతడిలోని రెండో కోణం ఈ భాగంలోనే బాగా హైలైట్ అవుతుంది. ఫస్టాఫ్ లో కనిపించిన కొన్ని పాత్రలు సెకండాఫ్ లోనూ కనిపిస్తాయి. అయితే అందులో కన్నా ఇందులోనే ఆ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడు కాలంతో వెనక్కి ప్రయాణించి, నేటి ప్రపంచంలోకి వచ్చి తనకు చెందిన నిధిని కాపాడుకోడమే ఈ సినిమా కథాంశం’... అంటూ వశిష్ట్ వెల్లడించాడు. 

టైమ్ ట్రావెల్ కథాంశంతో గతంలో ఇలాంటి సినిమానే రాలేదని చెప్పాలి. కొంతకాలంగా హిట్స్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కెరీర్ . ఈ సినిమాతో కొత్త మలుపు తిరగబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకు ముందు బాబాయ్ బాలయ్య (Balayya) నటించిన ‘ఆదిత్య 369’ (Aditya 369) టైమ్ ట్రావెల్ కథాంశంతోనే వచ్చిన సంగతి తెలిసిందే. అందులో బాలకృష్ణ (Balakrishna) 500 ఏళ్లు వెనక్కి, 500 ఏళ్ళు ముందుకు ప్రయాణించి అప్పటి ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించారు. మరి ‘బింబిసార’ గా అబ్బాయ్ కళ్యాణ్ రామ్..  ఇంకేస్థాయిలో అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తారో  చూడాలి.  

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.