Bigg Boss 6: ఓదారుస్తూ కాళ్ళు పట్టాడు.. ఉంచితే గుడి కట్టేలా ఉన్నాడు!

ABN , First Publish Date - 2022-10-01T22:19:48+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 (Biggboss 6)హౌస్‌లో ఇప్పటికి ముగ్గురు కెప్టెన్లు సీట్లో కూర్చున్నారు. మొదటి కెప్టెన్‌ బాలాదిత్య, రెండోవారం రాజ్‌, మూడో వారం ఆదిరెడ్డి కెప్టెన్‌ అయ్యారు. నాలుగోవారం కెప్టెన్సీ రేస్‌లో కీర్తిభట్‌, శ్రీ సత్య, సుదీప పోటీ పడ్డారు. ఫైనల్‌గా ఇంటికి కెప్టెన్‌గా కీర్తి ఎంపికయ్యారు.

Bigg Boss 6: ఓదారుస్తూ కాళ్ళు పట్టాడు.. ఉంచితే గుడి కట్టేలా ఉన్నాడు!

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 (Biggboss 6)హౌస్‌లో ఇప్పటికి ముగ్గురు కెప్టెన్లు సీట్లో కూర్చున్నారు. మొదటి కెప్టెన్‌ బాలాదిత్య, రెండోవారం రాజ్‌, మూడో వారం ఆదిరెడ్డి కెప్టెన్‌ అయ్యారు. నాలుగోవారం కెప్టెన్సీ రేస్‌లో కీర్తిభట్‌, శ్రీ సత్య, సుదీప పోటీ పడ్డారు. ఫైనల్‌గా ఇంటికి కెప్టెన్‌గా కీర్తి ఎంపికయ్యారు. ఈ సీజన్‌లో మొదటి కెప్టెన్‌ కీర్తినే. (Captain keerthi) శ్రీసత్య కెప్టెన్సీ మిస్‌ కావడంతో పక్కన కూర్చోగా.. లవర్‌బాయ్‌ అర్జున్‌ కళ్యాణ్‌ (Arjun kalyan)ఆమె కాళ్లు నొక్కుతూ పక్కన కూర్చున్నాడు. ఆ తర్వాత ఈ వారం వరస్ట్‌ పెర్ఫామర్‌ ఎవరో తేల్చే ప్రక్రియను మొదలు పెట్టారు. ఎవరైతే వరస్ట్‌ అని అనుకుంటున్నారో వాళ్ల పేరు రాసి.. బ్యాలెట్‌ బాక్స్‌లో వేయాలని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు సూచించారు. ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వారు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. 


వరెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఓట్లు ఎవరు.. ఎవరికి వేశారంటే...

ఫైమా– అర్జున్‌ కళ్యాణ్‌

సుదీప – అర్జున్‌ కళ్యాణ్‌

చంటి – అర్జున్‌ కళ్యాణ్‌

ఆరోహి – అర్జున్‌ కళ్యాణ్‌

కీర్తి – అర్జున్‌ కళ్యాణ్‌

ఆర్జే సూర్య – అర్జున్‌ కళ్యాణ్‌

మెరీనా–రోహిత్‌ – అర్జున్‌ కళ్యాణ్‌

శ్రీ సత్య – ఫైమా

ఇనయ – చంటి

గీతూ రాయల్‌ – చంటి

వాసంతి.. రాజ్‌

ఆదిరెడ్డి – చంటి

రాజ్‌.. గీతూ రాయల్‌

అర్జున్‌ కళ్యాణ్‌ – చంటి

బాలాదిత్య.. చంటి

రేవంత్‌ – ఇనయా

వరెస్ట్‌ పెర్‌ఫార్మర్‌ ప్రక్రియలో ఏడు మంది అర్జున్‌ కల్యాణ్‌కు ఓటు వేయడంతో అతన్ని జైలుకి పంపారు. అయితే తనకు సపోర్ట్‌ చేయడం వల్లే అర్జున్‌ జైలుకి వెళ్లాడని శ్రీసత్య చెబుతుంది. ఇక నాకు సపోర్ట్‌ చేయడు అని అంటుంది. అర్జున్‌ ఇది రెండోసారి జైలుకి వెళ్లడం. ఆ తర్వాత శ్రీసత్య మీటింగ్‌ పెట్టింది. అసలు నువ్వు బిగ్‌బాస్‌ ఎందుకు వచ్చావ్‌ అరున్‌? నా కోసం వచ్చావా? లేక టైటిల్‌ గెలవడానికి వచ్చావా? అంటే సన్నగా నవ్వడం మొదలుపెట్టాడు రొమాంటిక్‌ అర్జున్‌. చెప్పు అర్జున్‌ ఎవరి కోసం వచ్చావ్‌ అని సత్య గట్టిగా అడిగేసరికి ‘నా కోసమే వచ్చానని’ బలవంతంగా చెప్పాడు జైలులో ఉన్న కెమెరా వైపు చూస్తూ.. ‘నాకు ఒక్క చాన్స్‌ ఇవ్వంచి?.. నా ఆట ఏంటో చూపిస్త్తా.. నేను జెన్యూన్‌గా ఆడుతున్నాను. అమ్మాయిల్ని జైలుకు పంపడం ఎందుకు అని గతవారం నేను జైలుకి వెళ్లాను. ఇప్పుడు వాళ్లంతా కలిసి నన్ను జైలుకి పంపారు. ఈ ఒక్కవారం నన్ను ేసవ్‌ చేయండి వంద శాతం ఆడతాను’ అని బిగ్‌బాస్‌ని అడుక్కున్నాడు. ఆ మాటలు విన్న గీతూ, ఆదిరెడ్టి రివ్యూలు మొదలుపెట్టారు. ఈ వారం పోతాడేమో అని చెప్పుకుంటున్నారు. ఈ లవర్‌బాయ్‌ హౌస్‌లో కొనసాగితే శ్రీ సత్యకి గుడికట్టేలా ఉన్నాడు అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. 


Updated Date - 2022-10-01T22:19:48+05:30 IST