‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’: నటరాజ్ అలా.. బిందు ఇలా!

ABN , First Publish Date - 2022-04-14T03:25:52+05:30 IST

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ ఆసక్తికరంగా సాగుతోంది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్‌‌పై చురకలు వేస్తూ.. వారు చేసిన తప్పులను ఎప్పటికప్పుడు రివీల్ చేస్తున్నారు. ఆయనకు టార్గెట్ కాకుండా నడుచుకుంటుంది మాత్రం

‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’: నటరాజ్ అలా.. బిందు ఇలా!

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ ఆసక్తికరంగా సాగుతోంది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్‌‌పై చురకలు వేస్తూ.. వారు చేసిన తప్పులను ఎప్పటికప్పుడు రివీల్ చేస్తున్నారు. ఆయనకు టార్గెట్ కాకుండా నడుచుకుంటుంది మాత్రం నటరాజ్ మాస్టరే. మిగతా అందరినీ ఏదో ఒక సందర్భంలో నాగ్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. నటరాజ్‌ ఆలోచనతో పాటు ఆవేశం కూడా ఉండడం వల్లే మిగిలిన ఆటగాళ్లలా కాకుండా, నిజాయితీ అనే పాయింట్‌ పట్టుకుని ఆడుతున్నాడని నాగ్ కూడా ఈ మధ్య ఓ ఎపిసోడ్‌లో ప్రకటించారు. కోపం వస్తే కోపం, స్నేహం అనిపిస్తే స్నేహం చూపిస్తూ.. తనదైన స్టైల్‌ని హౌస్‌లో కనబరుస్తున్న నటరాజ్‌‌కు ఇప్పుడు ఫ్యాన్స్ పెరుగుతున్నారు. నటరాజ్ తర్వాత అషూ రెడ్డి కూడా నిజాయితీగా ఆడుతున్నా ఈసారి ఆమెను కూడా గట్టిగానే టార్గెట్‌ చేశారని తెలుస్తోంది. అందంగా ఉండే అఖిల్‌ ఆలోచిస్తూ గడపకుండా సమయం వచ్చినప్పుడు తనపై కౌంటర్‌ వేయాలని చూసిన బిందుపై తనలో కనిపించని ఒక కొత్త షేడ్‌ని చూపించాడు. బిందుమాధవికి కౌంటర్స్ ఇస్తూ అఖిల్ కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు.


హీరోయిన్‌ బిందుమాధవి ఎవరైనా గొడవపడుతుంటే.. వాళ్లని చూసి నవ్వుతూ ఆ పెద్ద పెద్ద కళ్లతో చూస్తూ.. ఆనందిస్తుండటం హౌస్‌లో ఉన్నవారికే కాకుండా చూసే ప్రేక్షకులకు కూడా నచ్చడం లేదు. అంతేకాదు, ఆమె నామినేషన్స్‌లో ఉన్న ప్రతీసారి గట్టెక్కడం చూస్తుంటే ఆమెకు బయట ఆర్మీ ఏదో పనిచేస్తున్నట్లుగా కూడా టాక్ నడుస్తుంది. ఏదీఏమైనా ఈసారి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ ఫేవరేట్ ఎవరనేది చెప్పడం మాత్రం ఇప్పటికైతే కాస్త కష్టంగానే ఉంది. ఎందుకంటే వారానికి ఒకరు ఈ లిస్ట్‌లో హైలెట్ అవుతున్నారు. ఈ వారం మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు.

Updated Date - 2022-04-14T03:25:52+05:30 IST