Bigg Boss 6: ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటే!

ABN , First Publish Date - 2022-09-25T01:18:17+05:30 IST

లీక్‌వీరులు ఈవారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే విషయంపై లీక్‌ చేశారు. శనివారం ఉదయం నుంచి హౌస్‌లో ఫైర్‌ బ్రాండ్‌ అయిన ఇనాయా సుల్తానా ఎలిమినేట్‌ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Bigg Boss 6: ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటే!

లీక్‌వీరులు (Bigg boss eliminations)ఈవారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే విషయంపై లీక్‌  చేశారు. శనివారం ఉదయం నుంచి హౌస్‌లో ఫైర్‌ బ్రాండ్‌ అయిన ఇనాయా సుల్తానా (Inaya sulthana) ఎలిమినేట్‌ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో హౌస్‌లో ఎప్పుడూ ఫైర్‌ మీదుండే ఇనాయ ఎలిమినేట్‌ కావడం ఏంటి? అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బిగ్‌బాస్‌ ఫాలోయర్లు కూడా. నిజం చెప్పాలంటే ఇనాయా ఈ వారం సూపర్‌ ఫుటేజ్‌ ఇచ్చింది.  కెప్టెన్సీ టాస్క్‌లో తన వైపు ఎవరూ లేకపోయినా ఒంటరిపోరాటం చేసింది.. అడవిలో ఆట టాస్క్‌లో ఒళ్లు హూనం అయ్యేలా ఆడింది. శ్రీహాన్‌, గీతూలతో జరిగిన గొడవలోనూ సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌ అయింది. 


శ్రీహాన్‌, రేవంత్‌లతో ‘వాడు’అనే ఇష్యూ మీద పోరాటం చేసింది. ‘వాడు అంటే ఒప్పుకోనివాడు నన్ను పిట్ట అని ఎలా అంటావ్‌ అంటూ శ్రీహాన్‌ని నిలదీసింది. హౌస్‌లో ఆడకుండా మేకప్‌ చేసుకుని ఉంటున్న అమ్మాయిలను వదిలేసి చలాకీగా ఆట ఆడుతున్న ఇనాయాను ఎలా ఎలిమినేట్‌ చేస్తారంటూ కామెంట్లు వస్తున్నాయి. 


అయితే తాజాగా మరో లీక్‌ వచ్చింది. అసలు ఎలిమినేట్‌ అయ్యేది ఇనాయా కాదు నేహా (Neha name leaked)అంటూ టాక్‌ నడుస్తోంది. దీంతో చాలామంది చాలామంది రిలాక్స్‌ అయ్యారు. బాగా ఆడి.. మంచి ఫుటేజ్‌ ఇస్తున్న ఇనాయాను పంపడం కంటే నేహాను పంపడమే బెస్ట్‌ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 


Updated Date - 2022-09-25T01:18:17+05:30 IST