Bigg Boss 6: 'వీడు' అంటే తట్టుకోలేవు.. కానీ పిట్ట ఏంటి? పద్దతి లేదా?

Twitter IconWatsapp IconFacebook Icon
Bigg Boss 6: వీడు అంటే తట్టుకోలేవు.. కానీ పిట్ట ఏంటి? పద్దతి లేదా?

బిగ్‌బాస్‌ హౌస్‌(Bigg Boss6)లో మూడోవారం కెప్టెన్సీ బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ రచ్చరచ్చగా సాగుతోంది. ఇంటి సభ్యులు ఎవరి స్ట్రాటజీలతో వారు ఆట ఆడుతున్నారు. హౌస్‌లో ఎవరూ తగ్గడం లేదు. ఎవరికివారు నోరేసుకుని పడిపోతున్నారు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా గీతూ శ్రీహాన్‌, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. వీరికి బిగ్‌బాస్‌ పెద్ద టాస్క్‌ ఇవ్వగా గీతూ (Geethu royal) సైలెంట్‌గా సైడ్‌ అయిపోయింది. వీరికి బ్రిగ్స్‌ టాస్క్‌ ఇవ్వగా. బ్రిగ్స్‌ కాపాడుకునే ప్రయత్నంలో ఫైమా చేతులు బ్రిగ్స్‌కి తగలడంతో.. ఆమె కూడా డిస్‌ క్వాలిఫై అయిపోయింది. రేవంత్‌ సంచాలక్‌గా బాధ్యత తీసుకున్నారు. మొదటి నుంచి కెప్టెన్‌ కావడం కోసం గట్టిగా పోరాడిన ఇనయా(Inaya Fire).. దీన్ని వ్యతిరేకించింది. శ్రీహాన్‌ (Srihaan)కూడా బ్రిగ్స్‌కి టచ్‌ అయ్యాడు దాంతో అతను కూడా పక్కకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతలో శ్రీహాన్‌.. ఉన్న చోట ఉండకుండా ‘ఏ పిట్ట వచ్చి నీ దగ్గర ఏం కూసినా.. సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్‌ తీసుకో’ అని అన్నాడు.  ఆ మాట విన్న ఇనయా చెలరేగిపోయింది.


‘ఏయ్‌ నన్ను పిట్ట అని ఎలా అంటావ్‌ అంటూ.. బాడీ షేమింగ్‌ ఎలా చేస్తావ్‌’ అంటూ శ్రీహాన్‌పై ఫైర్‌ అయింది.  శ్రీహాన్‌ కూడా.. ఏయ్‌ అంటూ వేలు చూపిస్తూ ఇనయ మీదికి దూసుకుని పోయాడు. నేను నీ పేరు పెట్టి అన్నానా? అంటూ నోరేసుపడ్డాడు.  మధ్యలో గీతూ వచ్చి పిట్ట అన్నది నిన్ను కాదు నన్ను అంటూ చెప్పుకొచ్చింది. ఇనాయాను మించేలా ఆమెను గీతూ రెట్టిస్తూ పో పో.. అంటూ హేళన చేసింది. పిట్టా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇనయాను రెచ్చగొట్టింది గీతూ. అయితే ఇనయా మాత్రం శ్రీహాన్‌ను వదలకుండా తరిమి తరిమి తిట్టింది. నిన్ను వీడు అంటే ఒప్పుకోని వాడిని నన్ను పిట్ట అని ఎలా అంటావ్‌’ అని మరోసారి దాడికి దిగింది. అయితే ఈ టాస్క్‌ మొత్తంలో గీతూ, ఇనాయా బాగా ఎలివేట్‌ అయ్యారు. శ్రీసత్య కూడా శక్తికి మించి ఆడింది. ఎలివేట్‌ అయ్యే సన్నివేశాలతో కెమెరాకు బాగానే చిక్కేలా ఆడింది. అయితే తన మనసులో మాట బయట పెట్టింది శ్రీసత్య. తను బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చింది ఆట.. కోసం, డబ్బు కోసమే అని చెప్పుకొచ్చింది. మరో పక్క ఇనయాకు వ్యతిరేకంగా ఉండే ఆదిరెడ్డి, గీతూ, నేహా. సూర్య ఆమె గురించి చెవులు కొరుక్కున్నారు.  శ్రీహాన్‌ని మగాడివైతే.. అంటూ నోరు జారిన విషయంలో.. వారంతంలో నాగార్జున గట్టిగానే క్లాస్‌ పీకుతారని మాట్లాడుకున్నారు. ఆడవిలో ఆట టాస్క్‌ పూర్తికావడంతో బిగ్‌ బాస్‌ అందరినీ హాల్‌లోకి పిలిచాడు. అడవిలో మొత్తం 141 రెడ్‌ ట్యాగ్‌ కలిగి విలువైన వస్తువులున్నాయి. వ్యాపారస్తుల దగ్గర 51, పోలీసులు దగ్గర 17, దొంగ దగ్గర 18 ఉన్నాయి కెప్టెన్‌ చెప్తాడు. ఈ గేమ్‌లో పోలీసులు విన్‌ అయ్యారు. గీతూ దగ్గర 15,800 డబ్బులు, బొమ్మలు 51 ఉన్నాయని చెప్పారు.  బంగారు కొబ్బరి బొండం శ్రీసత్యా దగ్గర ఉండడంతో గీతూకు సమానంగా ఉండి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచింది. దాంతో గీతూ, శ్రీసత్య, కెప్టెన్సీ టాస్క్‌కు యెస్‌ అన్నారు. 



AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.