బిగ్‌బాస్‌ హోస్ట్‌గా రమ్యకృష్ణ?

తమిళ ‘బిగ్‌బాస్‌’ రియాలిటీ షో సీజన్‌ 5కు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం ఈ షోకు కమల్‌హాసన్‌ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఇటీవలె ఆయన కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో కమల్‌హాసన్‌ స్థానంలో రమ్యకృష్ణ హోస్ట్‌గా ఇకపై షోను నడిపించనున్నారని సమాచారం. కమల్‌హాసన్‌ కూతురు శ్రుతీహాసన్‌ ఈ షోకు హోస్ట్‌గా ఉంటారని గతంలో వార్తలు వచ్చాయి. షో నిర్వాహకులు ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.