బిగ్ బి అమితాబ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా బాధితుల సహాయార్థం ఆయన పలు దానాలు చేశారు. తాజాగా సుమారు రూ.1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్లో గల లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆస్పత్రికి అందజేశారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం ఈ సంగతి వెల్లడించింది. ఆక్సిజన్ స్థాయి పడిపోతున్న, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పేషెంట్లకు చికిత్స అందించడానికి ఆ వెంటిలేటర్లు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని అధికారులు తెలిపారు.