'భూమిక' ట్రైలర్‌ విడుదల

ABN , First Publish Date - 2021-08-17T14:22:09+05:30 IST

టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్‌ మూవీ 'భూమిక'. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 23 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది.

'భూమిక' ట్రైలర్‌ విడుదల

టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్‌ మూవీ 'భూమిక'. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 23 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఈ క్రమంలో తాజగా ట్రైలర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. దట్టమైన అడవి లొకేషన్‌, భూమి గురించి వివరించే సంభాషణతో ప్రారంభమయిన ఈ ట్రైలర్‌.. ఓ రోడ్డు ప్రమాదం, ఓ హత్య, ఛేజింగ్‌ సన్నివేశాలతో ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఐశ్వర్య రాజేశ్‌ నటన ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బావుంది. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజు సమర్పణలో, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై కార్తికేయన్‌ సంతానం, సుందరం, జయరామన్‌ కలిసి నిర్మించారు. చూడాలి మరి తెలుగు ప్రేక్షకులను ఈ మూవీ ఏమేరకు ఆకట్టుకుంటుందో. 



Updated Date - 2021-08-17T14:22:09+05:30 IST