Bholaa Shankar: మెగాస్టార్ బర్త్ డేకి సాలీడ్ సర్‌ప్రైజ్..?

ABN , First Publish Date - 2022-06-29T17:53:40+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్స్‌లో 'భోళా శంకర్' (Bholaa Shankar) కూడా ఒకటి. మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా

Bholaa Shankar: మెగాస్టార్ బర్త్ డేకి సాలీడ్ సర్‌ప్రైజ్..?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్స్‌లో 'భోళా శంకర్' (Bholaa Shankar) కూడా ఒకటి. మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో చిరంజీవికి చెల్లెలిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh), తమన్నా భాటియా (Tamannah Bhatia) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే, 'భోళా శంకర్' నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. 


తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కి అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కుతున్న 'భోళా శంకర్', సోదరి సెంటిమెంట్ -  యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. అయితే, ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడు వస్తుందో అని మెగా అభిమానులే కాకుండా ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట ఓ హాట్ న్యూస్ వచ్చి చక్కర్లు కొడుతోంది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22న చిత్ర ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందట.


మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగా ట్రీట్ ఇవ్వాలని పక్కాగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమయితే మెగాస్టార్ బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కి పూనకాలే అనే చెప్పాలి. ఇక ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా, చిరు నటిస్తున్న మెగా '154'.. 2023, సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ పోస్టర్‌ను వదిలారు. ఇక ఇదే ఏడాది చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

Updated Date - 2022-06-29T17:53:40+05:30 IST