Bhola Shankar: షూటింగులో మెగాస్టార్..!

ABN , First Publish Date - 2022-01-24T15:36:03+05:30 IST

'భోళా శంకర్' మూవీ షూటింగులో మెగాస్టార్ చిరంజీవి జాయిన్ అయ్యారని తాజా సమాచారం. ప్రస్తుతం ఆయన చేస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఇదీ ఒకటి. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలై

Bhola Shankar: షూటింగులో మెగాస్టార్..!

'భోళా శంకర్' మూవీ షూటింగులో మెగాస్టార్ చిరంజీవి జాయిన్ అయ్యారని తాజా సమాచారం. ప్రస్తుతం ఆయన చేస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఇదీ ఒకటి. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలై శరవేగంగా సాగుతోంది. ఇందులో చిరు సరసన తమన్నా, చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ భాణీలు సమకూర్చుతున్నారు. ప్రముఖ నిర్మాత రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంలో అజిత్ హీరోగా నటించిన సూపర్ హిట్ 'వేదాళం' రీమేక్‌గా రూపొందుతోంది. మెగాస్టార్ కమిటైన చిత్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో కరోనా థర్డ్ వేవ్ విస్తృతంగా ఉన్నప్పటికీ తాజాగా షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే సమ్మర్ కానుకగా 'భోళా శంకర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇక చిరు, చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. కొరటాల శివ దర్శకుడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్.

Updated Date - 2022-01-24T15:36:03+05:30 IST