'భీమ్లా నాయక్': సినిమాటోగ్రాఫర్‌కు పవన్ అభినందనలు
ABN , First Publish Date - 2021-11-13T15:05:18+05:30 IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె చంద్ర తెరకెక్కితున్న మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న రవి కె చంద్రన్‌ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె చంద్ర తెరకెక్కితున్న మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న రవి కె చంద్రన్‌ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' మూవీకి తెలుగు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు అద్భుతమైన కెమెరా వర్క్‌ను అందిస్తున్నారని, మీ విజువల్స్ చాలా బావున్నాయని ప్రశంసిస్తూ పుష్పగుచ్చంతో పవన్ కళ్యాణ్ అభినందించారు.