డ్యూటీలో భీమ్లా నాయక్‌

ABN , First Publish Date - 2021-07-27T05:51:03+05:30 IST

పవన్‌కల్యాణ్‌ మరోసారి పోలీస్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మలయాళ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న సినిమా కోసం ఆయన ఖాకీచొక్కా వేసుకున్నారు...

డ్యూటీలో భీమ్లా నాయక్‌

పవన్‌కల్యాణ్‌ మరోసారి పోలీస్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మలయాళ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న సినిమా కోసం ఆయన ఖాకీచొక్కా వేసుకున్నారు. భీమ్లా నాయక్‌ పాత్రలో నటిస్తున్నారు. కరోనా రెండో దశ తర్వాత సోమవారం ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ మొదలైంది. పవన్‌తో పాటు రానా దగ్గుబాటిపై యాక్షన్‌ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లో పవన్‌ పోలీస్‌ దుస్తుల్లో ఉండగా, వెనుక నుంచి తీసిన ఫొటోను చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల చేసింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేస్తున్నామని తెలిపింది. ‘‘భీమ్లా నాయక్‌ మళ్లీ డ్యూటీలోకి తిరిగొచ్చారు’’ అని చిత్రబృందం పేర్కొంది. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం, పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Updated Date - 2021-07-27T05:51:03+05:30 IST