Bheemlanayak : ఓవర్సీస్‌లో భారీ రిలీజ్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-01-25T19:33:25+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకొని. ఫిబ్రవరి 25న విడుదల తేదీ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎట్టి పరిస్థితిల్లోనూ అదే డేట్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓవర్సీస్ లో ఈ సినిమాను ఫిబ్రవరి 24న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారని సమాచారం.

ఈ మూవీ విడుదల తేదీకి దగ్గరలో ఇతర స్టార్ హీరోల సినిమాలేవీ లేకపోవడంతో.. ‘భీమ్లా నాయక్’ సోలో గా బాక్సాఫీస్ ను ఏలతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సింగిల్స్ సినిమాపై అంచనాల్ని ఓ రేంజ్ లో పెంచాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతోందని తెలుస్తోంది. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మరి ‘భీమ్లా నాయక్’ తో పవర్ స్టార్ ఏ స్థాయి విజయం అందుకుంటారో చూడాలి.  

Updated Date - 2022-01-25T19:33:25+05:30 IST