Bheemla nayak : రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

ABN , First Publish Date - 2021-09-28T16:07:28+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీకిది రీమేక్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. సిన్సియర్ పోలీసాఫీసర్ భీమ్లా నాయక్ గా పవర్ స్టార్, రిటైర్డ్ హవాల్దార్ డేనియల్ శేఖర్ గా రానా నటిస్తున్న ఈ సినిమాని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

Bheemla nayak : రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లా నాయక్’. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీకిది రీమేక్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. సిన్సియర్ పోలీసాఫీసర్ భీమ్లా నాయక్ గా పవర్ స్టార్, రిటైర్డ్ హవాల్దార్ డేనియల్ శేఖర్ గా రానా నటిస్తున్న ఈ సినిమాని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీకి క్రియేటివ్ జీనియస్ త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే , డైలాగ్స్ అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారని కొద్ది రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకే ఈ మూవీ నిర్మాతలు ఆవార్తలకు చెక్ పెడుతూ .. ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.


జనవరి 12, 2022న భీమ్లా నాయక్ థియేటర్స్ లోనే విడుదలవుతుందని.. అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి జరిగే యుద్దం చూడ్డానికి  సిద్ధం కండి అని నిర్మాతలు ప్రకటించారు.  అయితే , జనవరి 13న మహేశ్ ‘సర్కారు వారి పాట’, జనవరి 14న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలు విడుదలవుతుండడంతో  వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ వార్ రసవత్తరంగా ఉండబోతోంది. ‘వకీల్ సాబ్’ మూవీ తర్వాత పవన్ నటిస్తోన్న సినిమా కావడంతో ‘భీమ్లా నాయక్’ చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి. 



Updated Date - 2021-09-28T16:07:28+05:30 IST