Bheemlaa nayak: వైరల్‌గా మారిన సంక్రాంతి పోస్టర్

'భీమ్లా నాయక్' చిత్రం నుంచి తాజాగా వచ్చిన సంక్రాంతి పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఈ మాస్ మల్టీస్టారర్ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్ వచ్చి విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భీమ్లా నాయక్, డానియేల్ శేఖర్ పాత్రల్లో నటిస్తున్న పవన్, రానా కలయితో డిజైన్ చేసిన ఓ పవర్‌ఫుల్ మాస్ పోస్టర్‌ను వదిలి పండుగ శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.