Bheemlaa nayak: సంక్రాంతికి వచ్చే అప్‌డేట్ అదేనా..?

ABN , First Publish Date - 2022-01-06T18:30:18+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా వస్తుందనుకున్న 'భీమ్లా నాయక్' చిత్రం పోస్ట్‌పోన్ అవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అందుకే సంక్రాంతికి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Bheemlaa nayak: సంక్రాంతికి వచ్చే అప్‌డేట్ అదేనా..?

సంక్రాంతి పండుగ సందర్భంగా వస్తుందనుకున్న 'భీమ్లా నాయక్' చిత్రం పోస్ట్‌పోన్ అవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అందుకే సంక్రాంతికి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె చంద్ర ఈ సినిమాను రూపొందిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే 'భీమ్లా నాయక్' సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ అన్నీ మంచి వ్యూస్ రాబట్టాయి. టీజర్స్‌కు విశేష స్పందన వచ్చింది. అయితే, ఈ సంక్రాంతికి ఫోక్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సాంగ్‌ను పవన్ కళ్యాణ్ పాడినట్టు తెలుస్తోంది. మాస్, క్లాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకునేలా థమన్ దీనిని కంపోజ్ చేశారట. చూడాలి మరి ఈ ఫోక్ సాంగ్ ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో. కాగా, ఈ చిత్రాన్ని మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.    

Updated Date - 2022-01-06T18:30:18+05:30 IST