Bheemla nayak: ఫారెస్ట్ ఆఫీసర్‌గా స్టార్ కమెడియన్..!

ABN , First Publish Date - 2022-01-14T15:05:36+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్ 'భీమ్లా నాయక్' మూవీలో సీనియర్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Bheemla nayak: ఫారెస్ట్ ఆఫీసర్‌గా స్టార్ కమెడియన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్ 'భీమ్లా నాయక్' మూవీలో సీనియర్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో బ్రహ్మానందం ఫారెస్ట్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారట. త్వరలో ఈ పాత్రకు సంబంధించిన అప్‌డేట్ కూడా రానున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా  నటిస్తున్నారు. థమన్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా, యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 


Updated Date - 2022-01-14T15:05:36+05:30 IST