‘భీమ్లా నాయక్' సెట్‌లో.. ఫొటో వైరల్
ABN , First Publish Date - 2021-10-21T21:49:25+05:30 IST
భీమ్లా నాయక్.. డేనియల్ శేఖర్ కాస్త సేద తీరుతున్నారు.. భీమ్లా.. నవ్వారు మంచంపైనా.. డేనియల్.. ఎద్దులబండిపైనా.. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? ‘భీమ్లానాయక్’ సెట్‌లో! షూటింగ్ గ్యాప్‌లో కాస్త రిలాక్స్ అవుతున్న ఫొటోను గురువారం చిత్రబృందం విడుదల చేసింది. సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, రానా కీలక పాత్రధారులుగా మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

భీమ్లా నాయక్.. డేనియల్ శేఖర్ కాస్త సేద తీరుతున్నారు..
భీమ్లా.. నవ్వారు మంచంపైనా..
డేనియల్.. ఎద్దులబండిపైనా..
ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా?
‘భీమ్లానాయక్’ సెట్‌లో!
షూటింగ్ గ్యాప్‌లో కాస్త రిలాక్స్ అవుతున్న ఫొటోను గురువారం చిత్రబృందం విడుదల చేసింది. సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, రానా కీలక పాత్రధారులుగా మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ క్లైమాక్స్‌లో వచ్చే పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ గ్యాప్‌లో హీరోలిద్దరూ కెమెరాకు ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ
ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.