BheemlaNayak : రన్‌టైమ్ మరీ అంత తక్కువ?

ABN , First Publish Date - 2022-01-25T15:15:06+05:30 IST

ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలకు మినిమమ్ రెండున్నర గంటలు, మ్యాగ్జిమమ్ 3గంటలుగా రన్ టైమ్ ఫిక్స్ చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ను మాత్రం చాలా తక్కువ ప్రదర్శనా సమయానికి కుదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు గంటల పదినిమిషాలు రన్ టైమ్ వచ్చేలా ఈ సినిమాను ట్రిమ్ చేశారట. రీసెంట్‌గా విడుదలైన చిత్రాలతో పోల్చితే ఈ మూవీకే అతి తక్కువ రన్ టైమ్ అని చెప్పాలి. దీంతో అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు.

BheemlaNayak : రన్‌టైమ్ మరీ అంత తక్కువ?

ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలకు మినిమమ్ రెండున్నర గంటలు, మ్యాగ్జిమమ్ 3గంటలుగా రన్ టైమ్ ఫిక్స్ చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తోన్న  ‘భీమ్లా నాయక్’ ను మాత్రం చాలా తక్కువ ప్రదర్శనా సమయానికి కుదించచోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు గంటల పదినిమిషాలు రన్ టైమ్ వచ్చేలా ఈ సినిమాను ట్రిమ్ చేస్తున్నారట. రీసెంట్‌గా విడుదలైన చిత్రాలతో పోల్చితే ఈ మూవీకే అతి తక్కువ రన్ టైమ్ అని చెప్పాలి. దీంతో అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. 


నిజానికి ‘భీమ్లానాయక్’ ఒరిజినల్ వెర్షన్ .. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం రన్ టైమ్ ఎక్కువగానే ఉంటుంది. అందులో అనవసరం అనుకున్న సన్నివేశాల్ని తొలగించి.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాల్ని యాడ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించాడట దర్శకుడు సాగర్ కె చంద్ర. అయినప్పటికీ ఈ సినిమా రన్ టైమ్ ఇంత తక్కువగా రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ ఔట్ పుట్ మీద నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను సంక్రాంతి బరిలోనే నిలపాలని నిర్మాతలు అంత పట్టుబట్టింది. మరి నిజంగానే ‘భీమ్లానాయక్’ అంత తక్కువ నిడివి కలిగిన సినిమానా కాదా అన్నది విడుదలయ్యాకా కానీ తెలియదు. 

Updated Date - 2022-01-25T15:15:06+05:30 IST