Bheemla nayak: ఫిబ్రవరి 25 కాదు ఏప్రిల్ 1..?

ABN , First Publish Date - 2022-01-22T21:33:58+05:30 IST

తాజాగా 'భీమ్లా నాయక్' చిత్రానికి మేకర్స్ రెండు తేదీలను ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి రెండు విడుదల తేదీలను

Bheemla nayak: ఫిబ్రవరి 25 కాదు ఏప్రిల్ 1..?

తాజాగా 'భీమ్లా నాయక్' చిత్రానికి మేకర్స్ రెండు తేదీలను ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి రెండు విడుదల తేదీలను ఎంపిక చేసుకున్న చిత్రబృందం.. ఆ రెండు తేదీలను ప్రకటిస్తూ రామరాజు, భీమ్ పాత్రలతో కొత్త పోస్టర్‌ను వదిలారు. ఈ క్రమలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్' సినిమాకు కూడా దర్శక నిర్మాతలు రెండు తేదీలను అనుకుంటున్నారట. ఇప్పటికే మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ప్రకటించారు. అయితే, ఆ తేదీ కాకుండా ఏప్రిల్ 1వ తేదీని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 


ఇంకా కొన్ని సీన్స్ షూట్ చేయాల్సి ఉండగా.. అందుకోసం ఈనెల 25 నుంచి షెడ్యూల్ ప్లాన్ చేశారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావచ్చిందట. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే మాత్రం ఫిబ్రవరి 25వ తేదీకే రిలీజ్ చేస్తారని, ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేసేందుకు సనాహాలు చేస్తున్నట్టు సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' చిత్రం విడుదల ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి ఒకేరోజు అన్నయ్య, తమ్ముడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయా లేక ఒకే చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందా చూడాలి.  

Updated Date - 2022-01-22T21:33:58+05:30 IST