Bheemla nayak: 'అడవి తల్లి' పాట పవన్ పాడలేదా..!

ABN , First Publish Date - 2021-12-04T13:13:27+05:30 IST

సాగర్ కే చంద్ర రూపొందిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి నేడు అడవి తల్లి మాట అనే సాంగ్ రాబోతోంది. అయితే, ఈ సాంగ్‌ను అందరూ పవన్ కళ్యాణ్

Bheemla nayak: 'అడవి తల్లి' పాట పవన్ పాడలేదా..!

సాగర్ కే చంద్ర రూపొందిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి నేడు అడవి తల్లి మాట అనే సాంగ్ రాబోతోంది. అయితే, ఈ సాంగ్‌ను అందరూ పవన్ కళ్యాణ్ పాడారని ప్రచారం చేస్తున్నారు. కానీ, అది నిజం కాదట. పవన్ ఈ సినిమాలో ఓ పాట పాడిన మాట వాస్తవమేనట. అయితే, అది ఇది కాదని తెలుస్తోంది. ఈరోజు 'భీమ్లా నాయక్' చిత్రం నుంచి నాలుగో సాంగ్‌గా 'అడవి తల్లి మాట' రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన మూడు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఇప్పుడు రాబోతున్న నాలుగో సాంగ్ ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. న్యూ ఇయర్‌లో సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Updated Date - 2021-12-04T13:13:27+05:30 IST