'భవదీయుడు భగత్ సింగ్': లొకేషన్స్ వేటలో హరీష్ శంకర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిటయిన సినిమాలలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించబోయో సినిమా కూడా ఒకటి. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి చిత్రయూనిట్ లొకేషన్స్ ఫైనల్ చేసేపనిలో పడ్డారని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' కొత్త షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ సినిమాను సెట్స్‌పైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, పవన్ - రానా హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' సంక్రాంతి పండుగ సందర్భంగా 2022, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. సితార ఎంటర్‌టైనర్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ దీనికి సంగీత దర్శకుడు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.