బెల్‌బాటమ్‌ విజయం పక్కా

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘బెల్‌బాటమ్‌’. ఈ చిత్రం జూలై 27న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా వేసిన ప్రివ్యూకూ చిత్ర కథానాయికలు వాణీకపూర్‌, హ్యూమా ఖురేషీ, లారాదత్తా అక్షయ్‌ కుమార్‌తో కలసి హాజరయ్యారు. ‘బెల్‌బాటమ్‌’ సినిమా కచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతుందని వారంతా విజయ సంకేతాలను చూపారు. ఆ చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. 80 వ దశకంలో సంచలనం సృష్టించిన భారతీయ విమానం హైజాక్‌ నేపథ్యంలో ‘బెల్‌బాటమ్‌’ చిత్రం తెరకెక్కింది. అక్షయ్‌ కుమార్‌ గూఢచారి పాత్రలో నటించారు. రంజిత్‌ తివారి దర్శకుడు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.