అప్పుడే ప్రయోగాలు చేస్తున్న బేబమ్మ..!

ABN , First Publish Date - 2021-12-09T18:28:00+05:30 IST

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన యంగ్ బ్యూటీ కృతిశెటి బేబమ్మ పాత్రలో బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ కృతిని ఎక్కడ కనిపించినా బేబమ్మ అనే అభిమానులు పిలుస్తున్నారు.

అప్పుడే ప్రయోగాలు చేస్తున్న బేబమ్మ..!

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన యంగ్ బ్యూటీ కృతిశెటి బేబమ్మ పాత్రలో బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ కృతిని ఎక్కడ కనిపించినా బేబమ్మ అనే అభిమానులు పిలుస్తున్నారు. అంతగా క్రేజ్ తెచ్చున్న ఆమె వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంది. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది. ఈనెల 17న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, నాగ చైతన్యతో 'బంగార్రాజు', నితిన్‌తో 'మాచర్ల నియోజిక వర్గం', రామ్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఇదే క్రమంలో ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీలోనూ నటించడానికి ఒకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. అయితే, గట్టిగా నాలుగు కమర్షియల్ హిట్స్ అందుకోకుండానే లేడీ ఓరియెంటెడ్ సినిమా ఒప్పుకోవడం అంటే ప్రయోగాలకు సిద్దమవుతుండటమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా కీర్తి సురేశ్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా 'మహానటి' లాంటి అద్బుతమైన సక్సెస్ తర్వాత 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి పరాజయాలను మూటగట్టుకుంది. అందుకే బేబమ్మ అప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం కరెక్టేనా అని మాట్లాడుకుంటున్నారట.

Updated Date - 2021-12-09T18:28:00+05:30 IST