'బీస్ట్' vs 'కేజీయఫ్ 2'..బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్నారా..!

ABN , First Publish Date - 2022-01-15T15:52:21+05:30 IST

'బీస్ట్' వర్సెస్ 'కేజీయఫ్ 2'..బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్నారా..! అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కేజీయఫ్ 2'

'బీస్ట్' vs 'కేజీయఫ్ 2'..బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్నారా..!

'బీస్ట్' వర్సెస్ 'కేజీయఫ్ 2'..బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్నారా..! అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కన్నడ రాకింగ్ స్టార్ యష్  ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కేజీయఫ్ 2' రిలీజ్ గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ అయి ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 14 న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


అయితే, ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 'బీస్ట్' మూవీని కూడా ఇదే తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే గనక నిజమైతే మాత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద 'బీస్ట్' - 'కేజీఎఫ్ 2'ల మధ్య గట్టిపోటీ ఉంటుందనడంలో సందేహం లేదు. చూడాలి మరి విజయ్ 'బీస్ట్' చిత్రాన్ని ఏప్రిల్ 14నే రిలీజ్ చేస్తారా.. లేదా మరో తేదీని ఫిక్స్ చేసుకుంటారా. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ  మూవీని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Updated Date - 2022-01-15T15:52:21+05:30 IST