‘బీస్ట్‌’ రెండో దశ షెడ్యూల్‌ ప్రారంభం

కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బీస్ట్‌’. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీత బాణీలను సమకూర్చుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ ఇటీవల ఈజిప్టులో పూర్తి చేసుకుంది. ఇపుడు రెండో షెడ్యూల్‌ చెన్నై నగరంలోని ఒక స్టూడియోలో జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ షూటింగులో పాల్గొనేందుకు హీరోయిన్‌ పూజా హెగ్గే కూడా నగరానికి వచ్చింది. ఈమె తొలి షెడ్యూల్‌ కోసం ఈజిప్టుకు కూడా వెళ్ళిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ప్రారంభమైన రెండో షెడ్యూల్‌లో ఈ చిత్రంలోని పాటలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. కాగా, విజయ్‌ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ (బీస్ట్‌)తో పాటు.. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.