బాస్ వచ్చాడంటూ అభిమానాన్ని చాటుకున్న సౌరవ్ గంగూలీ.. అమితాబ్ రియాక్షన్ ఇదే..

ABN , First Publish Date - 2022-01-20T20:03:41+05:30 IST

బాలీవుడ్‌లో ఉన్న లెజెండరీ యాక్టర్స్‌లో అమితాబ్ బచ్చన్ ఒకరు. అందులో ఎలాంటి సందేహం లేదు...

బాస్ వచ్చాడంటూ అభిమానాన్ని చాటుకున్న సౌరవ్ గంగూలీ.. అమితాబ్ రియాక్షన్ ఇదే..

బాలీవుడ్‌లో ఉన్న లెజెండరీ యాక్టర్స్‌లో అమితాబ్ బచ్చన్ ఒకరు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఈయన్ని కొన్ని లక్షల మంది సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉంటారు.


అమితాబ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌కి పెట్టాడు. అందులో బ్లూ కలర్ హుడీ వేసుకొని స్టైలిష్‌గా ఉన్నాడు. దానికి ‘అవును నిజమే.. నగరంలో పొగమంచు లేదు .. ముంబై ప్రకాశవంతంగా ఉంది.. కోవిడ్ లేకుండా ఉండటానికి మనందరినీ ముందుకు తీసుకువేళ్తోంది. నా ఉద్దేశ్యం మీకు తెలుసు కదా’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనిపై ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. దీంతో ఈ పిక్ వైరల్‌గా మారింది.


దీనిపై మాజీ భారత క్రికెటర్, బీసీసీఐ ఛీఫ్ సౌరవ్ గంగూలీ కామెంట్ పెట్టాడు. ‘బాస్ బయటికి వచ్చాడు. ఆయన వయసు కేవలం నంబర్ మాత్రమే’ అంటూ రాసుకొచ్చి ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.




దాదా కామెంట్ పెట్టిన కొద్ది సేపటికే దానికి రిప్లై ఇచ్చాడు బిగ్‌బీ. ‘చాలా సేపు ఏ పని చేయకుండా ఉండవలసి వచ్చింది’ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎంతోమంది నెటిజన్లు అమితాబ్ డెడికేషన్‌కి, స్టైల్‌కి ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2022-01-20T20:03:41+05:30 IST