వెండితెర ఎలుగుబంటి... వెళ్లిపోయింది!

ABN , First Publish Date - 2021-11-26T15:59:39+05:30 IST

అదొక ఎలుగుబంటి. అయితే, అలాంటిలాంటి ఎలుగు కాదు. పెద్ద సెలబ్రిటీ బేర్! డజన్ల కొద్దీ సినిమాలు, టెలివిజన్ షోస్‌లో అలరించిన అభినేత్రి! కాకపోతే, దురదృష్టవశాత్తూ అది ఇప్పుడు మరణించింది. ఆ విషాద వార్త విన్న చాలా మంది అమెరికన్స్ అయ్యో పాపం అంటూ బాధపడుతున్నారు...

వెండితెర ఎలుగుబంటి... వెళ్లిపోయింది!

అదొక ఎలుగుబంటి. అయితే, అలాంటిలాంటి ఎలుగు కాదు. పెద్ద సెలబ్రిటీ బేర్! డజన్ల కొద్దీ సినిమాలు, టెలివిజన్ షోస్‌లో అలరించిన అభినేత్రి! కాకపోతే, దురదృష్టవశాత్తూ అది ఇప్పుడు మరణించింది. ఆ విషాద వార్త విన్న చాలా మంది అమెరికన్స్ అయ్యో పాపం అంటూ బాధపడుతున్నారు... 


అనేక సినిమాల్లో కనిపించటంతో పాటూ ఈ మధ్య కాలంలో ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ లాంటి సూపర్ సక్సెస్ ఫుల్ షోలోనూ నటించిన ‘బార్ట్ ద బేర్ టూ’ ఒకప్పుడు  అలాస్కా పర్వత ప్రాంతాల్లో ఉండేది. అయితే, దానితో పాటూ తన చెల్లెలు మరో ఎలుగుబంటి కూడా ఒక వేటగాడి వల్ల అనాథలయ్యాయి. ఆ హంటర్... తల్లి ఎలుగును అప్పట్లో వేటాడటంతో ‘బార్ట్ ద బేర్ టూ’, దాని చెల్లెలు దిక్కులేనివయ్యాయి. బేర్స్‌ని కాపాడేందుకు ప్రత్యేకంగా పని చేస్తోన్న స్వచ్ఛంద సంస్థ ‘ద వైటల్ గ్రౌండ్ ఫౌండేషన్’ వాట్ని ఇంత కాలంగా కాపాడుతూ వస్తోంది. అయితే, కొన్ని రోజుల క్రితం వయస్సు రిత్యా ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో ‘బార్ట్ ద బేర్’ మరణించింది. ఈ విషయాన్ని ఫౌండేషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.   

Updated Date - 2021-11-26T15:59:39+05:30 IST