బప్పిలహిరి మరణంతో వైరల్‌గా మారిన ఓ పాత వీడియో.. అందులో ఏముందంటే..

ABN , First Publish Date - 2022-02-16T23:25:33+05:30 IST

బాలీవుడ్‌కు డిస్కో సాంగ్స్‌ను పరిచయం చేసిన ఘనత బప్పిలహిరికే

బప్పిలహిరి మరణంతో వైరల్‌గా మారిన ఓ పాత వీడియో.. అందులో ఏముందంటే..

బాలీవుడ్‌కు డిస్కో సాంగ్స్‌ను పరిచయం చేసిన ఘనత బప్పిలహిరికే దక్కుతుంది. తన ఐకానిక్ సాంగ్స్‌తో ఆయన ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రత్యేకమైన ఆహార్యంతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆయన పాటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆ పాటలు సరిహద్దులను దాటయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బప్పి‌లహిరి మరణించడంతో ఆయన పాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ రష్యా వ్యక్తి ఆయన హిట్ సాంగ్‌ను ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.  


సినీ ఇండస్ట్రీలో బప్పి‌లహిరి నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగారు. ఎన్నో హిట్ సాంగ్స్‌ను ప్రేక్షకులకు అందించారు. ‘జిమ్మి జిమ్మి’, ‘టమ్మ టమ్మ’ వంటి పాటలతో శ్రోతల మదిని దోచారు. కానీ, మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రంలోని డిస్కో డ్యాన్సర్ పాట ఇప్పటికి చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరేట్ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన మరణించడంతో రష్యన్ పాడిన డిస్కో డ్యాన్సర్ పాట ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలోని వ్యక్తి అచ్చం మిథున్ చక్రవర్తిలా డ్రెస్ చేసుకున్నారు. టాలెంట్ షోలో భాగంగా ఈ పాట పాడినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను దాదాపుగా 1.5కోట్ల మంది వీక్షించడం విశేషం.



Updated Date - 2022-02-16T23:25:33+05:30 IST