‘లడ్డుందా’ అంటూ బంగార్రాజు రెడీ!
ABN , First Publish Date - 2021-11-07T23:34:45+05:30 IST
నాగార్జున, రమ్యకృష్ణ జంటగా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను అలరించేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయన’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘బంగార్రాజు’. నాగ చైతన్య, కృతి శెట్టి మరో జంటగా కనిపిస్తారు. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ‘లడ్డుందా’ అంటూ సాగే మొదటి సింగిల్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నారు.

నాగార్జున, రమ్యకృష్ణ జంటగా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను అలరించేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయన’కు కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం ‘బంగార్రాజు’. నాగ చైతన్య, కృతి శెట్టి మరో జంటగా కనిపిస్తారు. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ‘లడ్డుందా’ అంటూ సాగే మొదటి సింగిల్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో నాగార్జున సందడి చేస్తున్నారు. అయితే ఇందులో నాగార్జున పక్కన ఉన్న హీరోయిన్ ఎవరనేది తెలియడం లేదు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అన్నపూర్ణ స్టూడియో, జీ స్టూడియో సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాత. సత్యానంద్ స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.