Anushka కోసం ఎదురు చూస్తున్న బెంగళూరు నాగరత్నమ్మ

ABN , First Publish Date - 2022-06-11T00:29:17+05:30 IST

అరుదైన, అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao).. ప్రస్తుతం ఓ బయోపిక్ రూపొందించే సన్నాహాల్లో ఉన్నారు. భోగినీ గా జీవితం ప్రారంభించి చివరకు యోగినిగా బతుకు చాలించిన గొప్ప మహిళ

Anushka కోసం ఎదురు చూస్తున్న బెంగళూరు నాగరత్నమ్మ

అరుదైన, అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao).. ప్రస్తుతం ఓ బయోపిక్ రూపొందించే సన్నాహాల్లో ఉన్నారు. భోగినీ గా జీవితం ప్రారంభించి చివరకు యోగినిగా బతుకు చాలించిన గొప్ప మహిళ బెంగళూరు నాగరత్నమ్మ (Bangalore Nagarathnamma). 1878లో పుట్టిన నాగరత్నమ్మ  భరత నాట్యానికి, కర్ణాటక సంగీతానికి ఎంతో సేవ చేశారు. ఆమెకు త్యాగరాజ స్వామి అంటే ఆరాధనా భావం. 


కావేరి నది ఒడ్డున ఆయన సమాధి శిధిలావస్థలో ఉంటే ఆ స్థలం కొని అక్కడ ఆయనకు ఓ గుడి కట్టించింది. ఎందరికో స్ఫూర్తి కలిగించిన బెంగళూరు నాగరత్నమ్మ కథను సినిమాగా తీయాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంకల్పించింది. ఎన్నో బయోపిక్స్‌కు అద్భుత రచన చేసిన బుర్రా సాయి మాధవ్ (Sai Madhav Burra) ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు.


నాగరత్నమ్మ పాత్రను స్వీటీ అనుష్క (Anushka) పోషిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. చిత్ర కథ కూడా ఆమెకు బాగా నచ్చిందని సమాచారం. అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే షూటింగ్ ప్రారంభించడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

Updated Date - 2022-06-11T00:29:17+05:30 IST