త్వరలో బంగబంధు

బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ జీవితకథతో తెరకెక్కుతున్న ‘బంగబంధు’ చిత్రం షూటింగ్‌ కొవిడ్‌, తుపాన్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోందని దర్శకుడు శ్యామ్‌ బెనగళ్‌ చెప్పారు. ఆయన దర్శకత్వంలో బెంగాలీ,హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ శత జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నా సాధ్యం కాలేదు. తుపాన్లు, కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ‘బంగబంధు’ చిత్రీకరణ నిలిచిపోయింది. ‘‘ప్రస్తుతం 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబర్‌ కల్లా పెండింగ్‌ పార్ట్‌ పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని శ్యామ్‌ బెనగళ్‌ తెలిపారు.


Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.