Bandla Ganesh: కరోనా లేకపోతే దున్నేసినట్లు చెబుతున్నారు

ABN , First Publish Date - 2021-09-27T22:31:44+05:30 IST

వచ్చే నెల పదో తేదీన జరగనున్న ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీగా తన గెలుపు తథ్యమని, తనకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని బండ్ల గణేశ్‌ అన్నారు. 2021–2023 టర్మ్‌కు ‘మా’ జనరల్‌ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా సోమవారం నామినేషన్‌ వేసిన అనంతరం గణేశ్‌ విలేకర్లతో మాట్లాడారు.

Bandla Ganesh: కరోనా లేకపోతే దున్నేసినట్లు చెబుతున్నారు

పరమేశ్వరుడి మద్దతు నాకుంది

నా విజయం తథ్యం..

ఎవరు గెలిచినా నాకు ప్రెసిడెంటే! 

మన హీరోలు బంగారు గనులు,  కోహినూర్‌ వజ్రాలు

వారు ప్రకాశిస్తే.. చాలా భవనాలు కట్టొచ్చు..

గెలిస్తే వంద ఇళ్లు పక్కా.. 

గత ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఏం చేశారు? 


వచ్చే నెల పదో తేదీన జరగనున్న ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీగా తన గెలుపు తథ్యమని, తనకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని బండ్ల గణేశ్‌ అన్నారు. 2021–2023 టర్మ్‌కు ‘మా’ జనరల్‌ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా సోమవారం నామినేషన్‌ వేసిన అనంతరం గణేశ్‌ విలేకర్లతో మాట్లాడారు. 


భారతదేశంలో జరిగే ఏ ఎన్నికల్లోనూ 100శాతం ఓట్లు పోల్‌ కావు. వీలైనంత మంది ఈసారి ‘మా’ ఎన్నికల్లో ఓటు వేస్తారు. ప్యానళ్లు నిర్వహించే పార్టీలకు వెళ్లండి. సభలకు వెళ్లండి.. వాళ్లు ఇచ్చే అతిథ్యం, తాయిలాలూ తీసుకోండి. మనస్సాక్షికి చెబుతూ నాకు ఓటేయండి. ఆ పరమేశ్వరుడి మద్దతు నాకు ఉంది. ‘మా’ ఎన్నికల్లో రాకెట్‌లా దూసుకెళత్తాను. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు. అధ్యక్షుడిగా ప్రకాశ్‌రాజ్‌, విష్ణు ఎవరు గెలిచినా నాకు ప్రెసిడెంటే. గత ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఏం చేశారు? మాట్లాడితే కరోనా పేరును అడ్డం పెట్టుకుంటున్నారు. కరోనా లేకపోతే వీళ్లేదో దున్నేసినట్లు చెబుతున్నారు. పాతికేళ్ల నుంచి ఈ తంతు చూస్తున్నాం. 

ఎంత గొప్ప పని అవుతుందో...

‘మా’ అసోసియేషన్‌కు భవనం కావాలి. అయితే, జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతంలో ప్యాలెస్‌ కడతామంటే కుదరదు. గవర్నమెంట్‌ స్థలం కేటాయిస్తుందో లేదో తెలియదు. కొంచెం దూరమనా కోకాపేట ప్రాంతంలో స్థలం తీసుకుని 100మంది పేద కళాకారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించాలి. సీఎం కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి ‘మహా ప్రభో’ మాకు స్థలం ఇప్పించండి. మా డబ్బులతో పేద కళాకారులకు ఇళ్లు కట్టిస్తాం’ అని అడిగితే ఆయన కాదనరని నా నమ్మకం. పేద కళాకారుల పాలిట అది ఎంత గొప్ప పని అవుతుందో అందరూ ఆలోచించాలి. నిధుల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన పరిశ్రమలో వినోదాన్ని పంచే కళాకారులు ఎంతోమంది ఉన్నాం. అలాంటిది వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి ఫండ్‌ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? మన హీరోలు బంగారు గనులు,  కోహినూర్‌ వజ్రాలు. ఆ వజ్రాలు ప్రకాశిేస్త, చాలా భవనాలు కట్టొచ్చు. నేను గెలిస్తే 100మంది పేద కళాకారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందేలా కృషి చేస్తాను. 




‘మా’లో మాకు గొడవలు పెట్టకండి...

‘బండ్ల గణేశ్‌ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారు’ అని జీవితా రాజశేఖర్‌ అనలేదు. దయచేసి ‘మా’లో మాకు గొడవలు పెట్టవద్దు. షూటింగ్‌ ప్రాంగణంలో ‘మా’ సమస్యలు ప్రస్తావిస్తానని ఓ పెద్దాయన చెప్పాడు. నిర్మాత డబ్బులు పెట్టి సినిమా తీస్తుంటే, అక్కడ చర్చలు పెట్టుకుంటారా? అదంతా తప్పు.

ఏపీ రాజకీయాల గురించి 11 తర్వాత మాట్లాడతా.. 

ప్రస్తుతం అంతా మా ఎన్నికల హడావిడిలో ఉన్నాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం కరెక్ట్‌  కాదు. పవన్‌కల్యాణ్‌గారి స్పీచ్‌ గురింంచి అక్టోబర్‌ 11వ తేదీన ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మాట్లాడతా.

Updated Date - 2021-09-27T22:31:44+05:30 IST