Maa elections: బండ్ల గణేశ్‌ షాకింగ్‌ ఎంట్రీ

ABN , First Publish Date - 2021-09-25T22:59:50+05:30 IST

గత రెండు టర్మ్‌లుగా చూస్తుంటే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి జరిగే ‘మా’ ఎన్నికలు (2021–23) కూడా అదే రీతిలో ఉన్నాయి. అయితే అప్పటితో కంపేర్‌ చేస్తే విమర్శలు, మాటల దాడులు, వివాదాలు ఇంకాస్త పెరిగాయనే చెప్పాలి. ఈసారి ఎన్నికల వేడి మరింత పెరిగింది.

Maa elections: బండ్ల గణేశ్‌ షాకింగ్‌ ఎంట్రీ

గత రెండు టర్మ్‌లుగా చూస్తుంటే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి జరిగే ‘మా’ ఎన్నికలు (2021–23) కూడా అదే రీతిలో ఉన్నాయి. అయితే అప్పటితో కంపేర్‌ చేస్తే విమర్శలు, మాటల దాడులు, వివాదాలు ఇంకాస్త పెరిగాయనే చెప్పాలి. ఈసారి ఎన్నికల వేడి మరింత పెరిగింది. తాజాగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ – మంచు విష్ణు ప్యానళ్లు ప్రచారం చాలా ఘాటుగా చేస్తున్నాయి. మరోవైపు, జనరల్‌ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగుతున్న బండ్ల గణేశ్‌ వినూత్న ప్రచారానికి తెర తీశారు.  ప్రకాశ్‌రాజ్‌ ఏర్పాటు చేసిన ‘సినిమా బిడ్డలం’’ ప్యానల్‌లో బండ్ల గణేశ్‌ సభ్యునిగా  కొన్నాళ్లపాటు ఉన్నారు. అయితే, ప్రకాశ్‌రాజ్‌ తన టీమ్‌లోకి జీవితా రాజశేఖర్‌ను తీసుకోవడాన్ని వ్యతిరేకించి.. ఆ టీమ్‌ నుంచి బయటకు వచ్చేశారు. జీవితపై పోటీ చేయాలనే ఉద్దేశంతో జనరల్‌ సెక్రటరీ పదవి కోసం తాను బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. తాజాగా ట్విటర్‌ వేదికగా ఓ పోస్టర్‌ షేర్‌ చేసి వినూత్న ప్రచారం మొదలుపెట్టారు. ‘ఒకే ఒక్క ఓటు. మా కోసం. మన కోసం. మనందరి కోసం. మా తరఫున ప్రశ్నించడం కోసం’ అని పోస్టర్‌లో పేర్కొన్నారు. ‘ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, జాయింట్‌ సెక్రటరీతోపాటు మిగిలిన ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా మీకు ఇష్టమైన వాళ్లను ఎన్నుకోండి.  జనరల్‌ సెక్రటరీగా నన్ను గెలిపించండి’’ అని ఆయన అభ్యర్థించారు. ఇండస్ర్టీలో ఉన్న అగ్ర, యువ నటీనటులను ట్యాగ్‌ చేస్తూ ఆయన ట్వీట్‌ పెట్టారు.




Updated Date - 2021-09-25T22:59:50+05:30 IST