Bandla Ganesh: మా బాస్ ఒక్క ఛాన్స్ ఇస్తే.. వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా!

Twitter IconWatsapp IconFacebook Icon
Bandla Ganesh: మా బాస్ ఒక్క ఛాన్స్ ఇస్తే.. వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా!

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla ganesh).. పవన్‌కల్యాణ్‌(Pawan kalyan)కు భక్తుడు అన్న సంగతి తెలిసిందే! సమయం దొరికిన ప్రతిసారీ పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటుంటారు. పవన్‌కు సంబంధించి ఏ విషయాన్నైనా ఆయన సెలబ్రేట్‌ చేసుకుంటాడు. గురువారం ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేశారు బండ్ల. ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్ర బృందం నవరాత్రులు సందర్భంగా ఆ చిత్ర వర్క్‌షాప్‌కు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. అందులో పవన్‌ కల్యాణ్‌ సూపర్‌ హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఆ ఫొటోలను బండ్ల గణేశ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ‘‘అబ్బబ్బ మా బాస్‌ను చూస్తుంటే గుండెల్లో దడ మొదలైంది. రక్తం ఉరకలేస్తుంది. ఇప్పుడు ఒక్కఛాన్స్‌ వస్తే.. వెయ్యి కోట్లు(1000 crores market) దాటే మార్కెట్‌ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్‌ బాస్‌’’ అంటూ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.  


Bandla Ganesh: మా బాస్ ఒక్క ఛాన్స్ ఇస్తే.. వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా!


పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ అక్టోబర్‌ ద్వితీయార్థంలో మొదలుకానుంది. భారీ బడ్జెట్‌తో ఎ.ఎం.రత్నం ( A.M ratnam) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మొగల్‌ సామ్రాజ్యానికి చెందిన కథతో రూపొందుతోంది. ఇందులో పవన్‌కల్యాణ్‌ మొగల్‌ రాజ్యం నుంచి కోహినూర్‌ వజ్రాల దొంగిలించే వ్యక్తిగా కనిపిస్తారని తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన పవర్‌ గ్లింప్స్‌కు ఆదరణ అదిరిపోయింది. నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్‌ రాంపాల్‌, నర్గీస్‌ ఫక్రీ కీలక పాత్రధారులు. 


Bandla Ganesh: మా బాస్ ఒక్క ఛాన్స్ ఇస్తే.. వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా!



AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.