‘బజరంగి భాయీజాన్’ సీక్వెల్ టైటిల్ ఇదేనా?

సల్మాన్ కెరీర్‌లోనే అద్బుతమైన చిత్రంగా నిలిచిపోయింది ‘బజరంగి భాయీజాన్’. సల్లూభాయ్ సూపర్ పెర్ఫార్మెన్స్, విజయేంద్రప్రసాద్ ఇన్నోవేటివ్ స్ర్కిప్ట్, కబీర్ ఖాన్ దర్శకత్వం.. సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఇండియాలో తప్పిపోయిన ఓ పాకిస్థానీ చిన్నారిని తిరిగి తన తల్లి దగ్గరకి చేర్చడమే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఆ క్రమంలో ఆంజనేయుడి భక్తుడైన భాయీజాన్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? ఆ ప్రయత్నంలో ఒక పాకిస్థాన్ జర్నలిస్ట్ అతడికి ఏ విధంగా సాయం చేశాడు? అన్నవి ఈ సినిమా హైలైట్ పాయింట్స్. మెగాస్టార్ ‘పసివాడి ప్రాణం’ సినిమా స్ఫూర్తితో ఈ కథను రాశానని విజేయేంద్ర ప్రసాదే గతంలో చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారు. 


ఇక సీక్వెల్ కు ‘పవనపుత్ర భాయీజాన్’ అనే టైటిల్ ను ఖాయం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. బజరంగి అన్నా, పవనపుత్ర అన్నా ఆంజనేయ స్వామి అనే అర్ధం వస్తాయి. విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నట్టు సల్మాన్ స్వయంగా ధ్రువీకరించారు. అలాగే విజయేంద్ర ప్రసాద్ సైతం సీక్వెల్ గురించి గతంలో తెలిపారు. దీని కోసం ఓ మంచి  లైన్ రెడీ చేశానని. ప్రస్తుతం దాన్ని డెవలప్ చేసే ప్రాసెస్ లో ఉన్నానని ఆయన తెలిపారు. మరి ఈ సినిమాకి కబీర్ ఖానే డైరెక్టరా లేక వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తారా అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం ‘టైగర్ 3’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్.. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ లో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అతి త్వరలో ‘పవనపుత్ర భాయీజాన్’ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోంది.   

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.