‘భజరంగీ భాయిజాన్’ పాపకి భారతరత్న అంబేడ్కర్ అవార్డు.. సల్మాన్ ఖాన్‌కి అంకితమిచ్చిన నటి

బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ చిత్రం ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇందులో నటించిన సల్లుభాయ్‌కి ఎంత పేరు వచ్చింది. ఈ మూవీ సల్లుభాయ్‌తో పాలు ఆయన కలిసి నటించిన పాప హర్షాలీ మల్హోత్రాకి మంచి పేరునే తెచ్చిపెట్టింది.


తాజాగా 13 ఏళ్ల హర్హాలీని మహరాష్ట్ర పభుత్వం భారతరత్న డా బీఆర్ అంబేడ్కర్ అవార్డుతో సత్కరించింది.  ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న ఈ బాల నటి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సంతోషాన్ని పంచుకుంది. 


అంతేకాకుండా ఈ అవార్డును నటుడు సల్మాన్ ఖాన్, ఆ మూవీ డైరెక్టర్ కబీర్ ఖాన్, అలాగే నిర్మాతలు, ఇతర చిత్ర బృందం అందరికి డేడికేట్ చేస్తున్నట్లు పోస్ట్ పెట్టింది.


దీంతో ఈ పోస్ట్ చాలా మంది నెటిజన్లు స్పందించారు. ‘ఇలాగే ఎన్నో విజయాలను చూడాలని కోరుకుంటున్నట్లు’ అని ఒకరు.. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది ఇలాగే ముందుకు వెళ్లు’ అంటూ మరొకరు.. అయితే మరొకరైతే ‘మున్ని ఈ అవార్డు నీది మాత్రమే.. ఎందుకంటే నీ నటనతోనే దీన్ని గెలుచుకున్నావ‌’ని వరుస కామెంట్స్‌ పెట్టారు.Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.