ఇటీవల విడుదలై బాలీవుడ్లో కాసుల వర్షం కురిపిస్తున్న ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై వివాదాలు కూడా అదే రేంజ్లో జరుగుతున్నాయి. బీజేపీ ఈ చిత్రానికి ఫేవర్‌గా ఉందని ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులకు రీ క్రియేషన్ క్లబ్ ‘బాహుబలి –1’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలని నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటో తేదీన ఢిల్లీ మహదేవ్ రోడ్‌లోని ఫిల్మ్ డివిజన్ ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. రాజసభ సెక్రటేరియట్లో హిందీ, ఇతర భాషలు మాట్లాడే వారి మధ్య భాష మార్పిడిని ప్రోత్సహించాలని ఎగువసభకు చెందిన హిందీ సలాహ్కార్ సూచించి, సభ్యులు ఈ చిత్రం చూడాల్సిందిగా కోరింది.
మార్చి 15న జరిగిన సమావేశంలో ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం అద్భుతంగా ఉందని, ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని మోదీ అన్నారు. ఎంపీలు అందరూ ఈ చిత్రాన్ని చూడాలని ఆయన కోరారు. ఢిల్లీ ఈ సినిమాకు పన్ను రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ‘ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో విడుదల చేయమని దర్శకుడికి చెప్పండి. అప్పుడు అందరూ ఫ్రీగా చూడగలరు’’ అని కేజ్రీవాల్ అన్నారు.