‘బంగార్రాజు’ డైరెక్టర్‌కు భారీ ఆఫర్

ABN , First Publish Date - 2022-01-17T17:47:22+05:30 IST

‘సోగ్గాడే చిన్నినాయన, నేలటిక్కెట్టు’ చిత్రాలతో మెప్పించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. తాజాగా నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కించిన ‘బంగార్రాజు’ చిత్రం ఈ దర్శకుడికి లక్ ను తెచ్చిపెట్టింది. అనూహ్యంగా ఈ సంక్రాంతి బరిలోకి దిగి.. విన్నర్ గా నిలిచింది ‘బంగార్రాజు’ చిత్రం. థర్డ్ వేవ్ కారణంగా పెద్ద సినిమాలన్నీ వెనక్కి తగ్గడంతో రింగ్ లోకి దిగి కింగ్ అనిపించుకుంది ‘బంగార్రాజు’. మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ. 53కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

‘బంగార్రాజు’ డైరెక్టర్‌కు భారీ ఆఫర్

‘సోగ్గాడే చిన్నినాయన, నేలటిక్కెట్టు’ చిత్రాలతో మెప్పించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. తాజాగా నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కించిన ‘బంగార్రాజు’ చిత్రం ఈ దర్శకుడికి లక్ ను తెచ్చిపెట్టింది. అనూహ్యంగా ఈ సంక్రాంతి బరిలోకి దిగి..  విన్నర్ గా నిలిచింది ‘బంగార్రాజు’ చిత్రం. థర్డ్ వేవ్ కారణంగా పెద్ద సినిమాలన్నీ వెనక్కి తగ్గడంతో రింగ్ లోకి దిగి కింగ్ అనిపించుకుంది ‘బంగార్రాజు’. మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ. 53కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతి తక్కువ టైమ్ లో ‘బంగార్రాజు’ చిత్రాన్ని  తెరకెక్కించి.. మంచి ఔట్ పుట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదుపరి చిత్రం కోసం భారీ ఆఫర్ ను సొంతం చేసుకోవడం హట్ టాపిక్ గా మారింది.


కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా కళ్యాణ్ కృష్ణకు భారీ ఆఫర్ ఇవ్వడం విశేషం. సూర్య, కార్తి హీరోలుగా ఆయన చాలా సినిమాలు తీశారు. వాటిలో ఎక్కువ శాతం సక్సెస్ సాధించాయి. అలాగే ఆర్య, శివకార్తికేయన్ తో కూడా పలు చిత్రాలు నిర్మించి సక్సెస్ అందుకున్నారు. అలాంటి దర్శకుడు కళ్యాణ్ కృష్ణను తదుపరి చిత్రానికి దర్శకుడిగా ఎంపిక చేయడం విశేషమనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో ఉండబోతోంది. త్వరలోనే వివరాలు తెలుస్తాయి. మరి కళ్యాణ్ చేయబోయే సినిమాకి హీరో ఎవరవుతారో చూడాలి. 



Updated Date - 2022-01-17T17:47:22+05:30 IST