‘‘ మిన్నల్ మురళి ’’ని మెచ్చుకున్న కరణ్‌జోహార్

మలయాళంలో ప్రయోగాత్మక చిత్రాలంటే గుర్తుకొచ్చే యువ నటుడు టోవినో థామస్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘‘ మిన్నల్ మురళి’’. మలయాళం ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్‌తో ఆ చిత్రం తెరకెక్కింది.  నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని రోజుల క్రితమే విడుదలయింది. ఆ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ సినిమాను చూసిన బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అయిన కరణ్ జోహార్  టోవినో థామస్‌ను మెచ్చుకున్నారు. 


మలయాళీ చిత్రమైన ‘‘ మిన్నళ్ మురళి’’ ని ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ఈ మధ్యనే చూశారు. టోవినో థామస్ నటనకు ఫిదా అయ్యారు. దీంతో టోవినోకు పర్సనల్‌గా వాట్సప్ మెసేజ్ చేశారు. ఆ మెసేజ్‌ను టోవినో ఇన్‌స్టాగ్రామ్‌లోని అభిమానులతో పంచుకున్నారు. ‘‘ హే టోవినో. గత రాత్రి ‘మిన్నళ్ మిరళి’ ని చూసే అవకాశం నాకు దక్కింది. సూపర్ హీరో మూవీస్‌లో ఈ సినిమా కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. నువ్వు కూడా చాలా బాగా నటించావు. కంగ్రాచ్యులేషన్స్ ’’ అని కరణ్ జోహార్ తెలిపారు.      

కరణ్ మెసేజ్ అనంతరం తన ఆనందాన్ని టోవినో అభిమానులతో పంచుకున్నారు. ‘‘ ఎన్నో హిట్‌లను అందించిన కరణ్ జోహార్ నా పనితనాన్ని మెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ చిత్రాన్ని చూసి మీరు ఎంతో ఎంజాయ్ చేశారని నాకు అర్థమవుతోంది ’’ అని టోవినో థామస్ చెప్పారు.  


Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.