అయ్యప్పనుమ్‌...సెట్‌లోకి పవన్‌ ఆగమనం!

లాక్‌డౌన్‌ తొలగించడంతో తెలుగు సినిమా చిత్రీకరణలు జోరందుకుంటున్నాయి. త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ కూడా సెట్‌లోకి అడుగుపెట్టనున్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌  షూటింగ్‌ ఈ నెల 12 నుంచి పున:ప్రారంభం కానుంది. 13 నుంచి పవన్‌ చిత్రీకరణలో పాల్గోనున్నారు. అలాగే నిత్యామీనన్‌ తొలిసారి పవన్‌ కల్యాణ్‌తో జోడీ కట్టబోతున్నారనీ, పవన్‌తో పాటు నిత్యా కూడా ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నారు. ‘అయ్యప్పనుమ్‌...’ రీమేక్‌ తో పాటు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందతున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో కూడా పవన్‌ పాల్గోనున్నారని సమాచారం. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.