‘అవెంజర్స్’ హీరోతో ఒకే ఫ్రేమ్‌లో Sonakshi Sinha.. ఐ లవ్ ఇండియా అంటూ..

ABN , First Publish Date - 2022-01-04T17:03:21+05:30 IST

నెట్ వినియోగం పెరిగి సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఎక్కడి మనుషుల మరెక్కడి మనుషులతో మాటలు, ఫ్రెండ్షిప్‌లు జరుగుతున్నాయి...

‘అవెంజర్స్’ హీరోతో ఒకే ఫ్రేమ్‌లో Sonakshi Sinha.. ఐ లవ్ ఇండియా అంటూ..

నెట్ వినియోగంతో సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఒకచోట ఉండే మనుషులు.. మరెక్కడో మనుషులతో మాటలు, ఫ్రెండ్షిప్‌లు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోని వివిధ సినీ పరిశ్రమల స్టార్ల మధ్య సంభాషణలు కుదురుతున్నాయి.


గతంలో బాలీవుడ్ బ్యూటీస్ అనుష్క శర్మ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హలీవుడ్ భామలు అమండా సేర్నీ, జులియా మైకేల్ సరదాగా ఇలాగే ముచ్చటించారు. అదే తరహాలో తాజాగా ‘అవెంజర్స్’ సిరీస్‌లో థోర్‌ పాత్రని పోషించిన క్రిస్ హేమ్స్‌వర్త్‌తో మాట కలిపింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.


ఓ మల్టీ విటమిన్ బ్రాండ్ ప్రమోషన్ కోసం వీరిద్దరి సోషల్  వీడియో కాలింగ్ ద్వారా మాట కలిపారు. అందులో తన సినిమా ‘ఎక్స్‌ట్రాక్సన్’ సినిమా షూటింగ్ అనుభవం గురించి మాట్లాడుతూ.. ‘నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. అక్కడి మనుషులన్నా.. అక్కడి ఆహారమన్న నాకు చాలా ఇష్టం. అక్కడ అందరూ కూడా చాలా ఆదరణ, అభిమానాన్ని చూపిస్తార‌’ని చెప్పాడు.




అంతేకాకుండా ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘నా సినిమా షూటింగ్ చూడడానికి చాలా మంది జనం రావడమే కాకుండా చప్పట్లు కొడుతూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. అది హృదయానికి హత్తుకుంది. ఆ అనుభవాన్ని నా జీవితంలో మర్చిపోలేన’ని క్రిస్ తెలిపాడు.


క్రిస్ మాటలపై సోనాక్షి స్పందిస్తూ.. ‘ఇండియా కూడా నిన్ను ఇష్టపడుతోంది క్రిస్’ అని తెలిపింది. ఈ భామ దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఎంతో సరదాగా సాగిన ఇంటర్వ్యూని మీరు ఓ సారి చూసేయండి..

Updated Date - 2022-01-04T17:03:21+05:30 IST