అట్లీ-షారుక్‌ మూవీ ప్రారంభం..సెట్‌లో నయన్, ప్రియమణి..!

ABN , First Publish Date - 2021-09-04T17:02:30+05:30 IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ కాంబినేషన్‌లో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని గత ఏడాది నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అట్లీ-షారుక్‌ మూవీ ప్రారంభం..సెట్‌లో నయన్, ప్రియమణి..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ కాంబినేషన్‌లో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని గత ఏడాది నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రారంభమయిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఇందులో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, ప్రియమణి షారుక్ సరసన నటిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు తాజాగా మొదలైన చిత్ర షూటింగ్‌లో నయన్, ప్రియమణి కూడా జాయిన్ అయ్యారట. కాగా గతంలో ప్రియమణి.. షారుక్‌తో కలిసి నటించింది. ఇక దర్శకుడిగా అట్లీకి, హీరోయిన్‌గా నయన్‌కి ఈ సినిమా బాలీవుడ్‌లో మొదటిది. షారుక్ హిందీలో 'పఠాన్' సినిమా చేస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో దీపిక పదుకొణ్ హీరోయిన్‌గా, జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Updated Date - 2021-09-04T17:02:30+05:30 IST