నువ్వు నవ్వితే...
ABN , First Publish Date - 2021-09-28T05:10:35+05:30 IST
ఆది సాయికుమార్, నువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతిథి దేవో భవ’. రాజాబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల నిర్మాతలు. శేఖర్ చంద్ర సంగీతంలో సిద్ శ్రీరామ్, నూతన మోహన్ పాడిన...

ఆది సాయికుమార్, నువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతిథి దేవో భవ’. రాజాబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల నిర్మాతలు. శేఖర్ చంద్ర సంగీతంలో సిద్ శ్రీరామ్, నూతన మోహన్ పాడిన ‘బాగుంటుంది నువ్వు నవ్వితే...’ పాటను సోమవారం విడుదల చేశారు. దీనికి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ‘‘ఈ పాటతో సినిమాపై అంచనాలు పెరిగాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు.