shekar : టాలీవుడ్‌లోకి మరో మల్లూ భామ ఎంట్రీ

ABN , First Publish Date - 2022-05-17T20:26:46+05:30 IST

యాంగ్రీమేన్ రాజశేఖర్ (Rajashekar) తాజా చిత్రం ‘శేఖర్’ (shekar). జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘శేఖర్’ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ (Joseph) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

shekar : టాలీవుడ్‌లోకి మరో మల్లూ భామ ఎంట్రీ

యాంగ్రీమేన్ రాజశేఖర్ (Rajashekar) తాజా చిత్రం ‘శేఖర్’ (shekar). జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘శేఖర్’ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ (Joseph) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రాన్ని తమిళంలో ‘విచిత్రన్’ (Visithiran) పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇక ‘శేఖర్’ చిత్రంతో మరో అందాల మల్లూభామ టాలీవుడ్ లోకి కథానాయికగా ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఆమె పేరు ఆత్మీయా రాజన్ (Athmeeya rajan) . మలయాళ వెర్షన్ లో కూడా ఆమెనే కథానాయికగా నటించి మెప్పించింది. అందం, అభినయంలో మంచి టాలెంట్ ఉన్న అమ్మడిని తెలుగు వెర్షన్ లోనూ హీరోయిన్ ఫిక్స్ చేశారు. దానికి తగ్గట్టునే ‘శేఖర్’ లో ఆమె పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకుంటున్నారు మేకర్స్. 


2009 లో ‘వెళ్ళత్తూవల్’ (తెల్లఈక) చిత్రంతో మలయాళంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది ఆత్మీయా రాజన్ (Athmeeya rajan) .. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఆమెకు వరుసగా మాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లోనూ కథానాయికగా అవకాశాలొచ్చాయి. ఆ తర్వాత ‘అమీబా, నామం, మార్కోనీ మత్తాయి, కోల్డ్ కేస్, అవియల్, పుళు’ లాంటి మలయాళ చిత్రాల్లో నటించి బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకుంది. ‘శేఖర్’ చిత్రంలో రాజశేఖర్ భార్యగా కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే.. ఆమె కూతురుగా రాజశేఖర్ కుమార్తె (Shivani) శివానీ నటిస్తోంది. 


పోలీసులకు సవాల్ గా మారిన యాక్సిడెంట్ కేసుల్ని ఛేదించడానికి రిటైర్డ్ పోలీసాఫీసర్ (Retired Police Officer) శేఖర్ (shekar) బరిలోకి దిగుతాడు. ఆ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్ళు, తెలుసుకున్న నిజాలు ఏంటనేది సినిమాకి కీలకం. ఈ నేపథ్యంలో శేఖర్ తీసుకొన్న నిర్ణయం ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అలాగే.. ఆ కేసు విషయంలో భార్యా, కూతుళ్ళ ప్రమేయం ఏంటన్నది మిగతా కథ. మరి ‘శేఖర్’ (shekar) చిత్రంతో కథానాయికగా ఆత్మీయా రాజన్ (Athmeeya rajan) ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటుందో చూడాలి. 

Updated Date - 2022-05-17T20:26:46+05:30 IST