దొరికింది.. దొరికింది.. ఆ హీరోకి పిల్ల దొరికేసిందోచ్!

పెళ్లి చేసుకోవడానికి పిల్లని వెతికి పెట్టండి అంటూ వారం, పది రోజులుగా సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న హీరో విష్వక్సేన్‌కి పిల్ల దొరికేసింది. ఈ విషయం ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే ఇదంతా రియల్ కాదండోయ్.. తను తాజాగా నటిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కోసం. ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే దానిపై ప్రత్యేకంగా చిత్రయూనిట్ ఓ వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పిల్ల ఎవరో కాదు.. ‘అల్లంగారి పెళ్లికూతురు రుక్సర్‌ ధిల్లాన్‌’ అని రివీల్ చేస్తూ.. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆమె పరిచయ వీడియోని చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


కాగా, ఎస్‌విసిసి డిజిటల్ మీడియా పతాకంపై బివిఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విద్యాసాగర్ చింతా దర్శకుడు. రవి కిరణ్ కోలా కథను సమకూర్చారు. సుధీర్ ఈదరతో కలిసి బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో చివరిలో ‘ఓ ఆడపిల్ల’ అనే లిరిక్స్‌తో సాగే ఈ చిత్ర ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను జనవరి 19న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.