యువ హీరో అశోక్ సెల్వన్ మరో కొత్త చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. వయకామ్ 18 స్టూడియోస్, రైజ్ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇందులో అశోక్ సెల్వన్‌తో కలిసి ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. దీనికోసం రీతూవర్మ, అపర్ణా బాలమురళి, శివాత్మికలను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ ఆర్.కార్తీక్ తెరకెక్కించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి నిర్మాతగా శ్రీనిధి సాగర్ వ్యవహరిస్తున్నారు.