హీరోయిన్ ఆష్నా జవేరి ఫేస్‌బుక్ అకౌంట్‌ హ్యాక్‌

హీరో సంతానం ఆస్థాన హీరోయిన్‌ ఆష్నా జవేరి సోషల్‌ మీడియా ఖాతా హ్యాక్‌ అయింది. ‘వల్లవనుక్కు పుల్లుం ఆయుధం’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఆష్నా... ఆ తర్వాత సంతానం హీరోగా వచ్చిన పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోన్న ఆష్నా జవేరి ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయినట్లుగా ఆమె తెలిసింది. ఈ విషయాన్ని ఆష్నా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ‘నా ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయింది. దీనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఖాతాలో వచ్చే పోస్ట్‌లు నేను చేస్తున్నవి కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు’ అంటూ ఆష్నా జవేరి తన ట్వీట్‌లో పేర్కొంది. 


Otherwoodsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.